లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి పోలీసులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని సీపీ అంజనీ కుమార్ అన్నారు. దేశంలోని ఇతర మహానగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో కరోనా కేసులు తక్కువ సంఖ్యలోనే నమోదవుతున్నాయని... ఇందులో పోలీస్ శాఖ కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు.
'కరోనా నియంత్రణలో పోలీసుల సేవలు వెలకట్టలేనివి' - కొవిడ్‌ను జయించిన హైదరాబాద్ పోలీసులను విధుల్లోకి ఆహ్వానించిన హైదరాబాద్ సీపీ
విధి నిర్వహణలో కరోనా బారిన పడిన పోలీసులు త్వరగా కోలుకొని తిరిగి విధుల్లో చేరుతూ... సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని సీపీ అంజనీ కుమార్ అన్నారు. విధుల్లో చేరిన పోలీసులను ప్రశంస పత్రాలిచ్చి అభినందించారు.
కరోనా నియంత్రణలో పోలీసులు సేవలు వెలకట్టలేనివి
పశ్చిమ మండలం పరిధిలో 45 మంది పోలీస్ అధికారులు, కానిస్టేబుళ్లు కరోనా నుంచి కోలుకున్నారు. వాళ్లందరిని తిరిగి విధుల్లోకి ఆహ్వానించారు. బహుమతి ఇచ్చి, ప్రశంసా పత్రాలతో అభినందించారు.
ఇదీ చూడండి:'ఐకమత్యం, ధైర్యంతోనే వైరస్‌పై విజయం'