రాష్ట్రంలో కరోనా మహ్మమారి విజృంభిస్తోంది. వైరస్ వ్యాప్తి కారణంగా సామాన్య జనంతోపాటు ప్రముఖులు ఆసుపత్రి పాలవుతున్నారు. తాజాగా రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీకి కరోనా సోకింది. ఆయనతో పాటు బంధువుకు కూడా మహమ్మారి సోకినట్టు తెలుస్తోంది.
హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్
రాష్ట్రంలో కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా సోకింది. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ దీనిని ధ్రువీకరించారు.
హోం మంత్రికి కరోనా...! ధృవీకరించని అధికారులు
అర్ధరాత్రి వారిని బంజారహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. ఇటీవల హోం మంత్రి భద్రత సిబ్బందికి కూడా కరోనా సోకింది. వారి నుంచే మహమూద్ అలీకి సోకి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు. హోం మంత్రికి కరోనా సోకిందనే విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ధ్రువీకరించారు.
Last Updated : Jun 29, 2020, 1:28 PM IST