మే 7 వరకు ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్ పాటించాలని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. మలక్‌పేటలో అగ్నిమాపకశాఖ, విపత్తు నివారణశాఖ ఆధ్వర్యంలో ఫైర్ ఇంజిన్లతో శానిటైజేషన్ నిర్వహించారు. ఆ కార్యక్రమాన్ని హోమంత్రి ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలో లాక్‌డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నామని అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మహమూద్ అలీ హెచ్చరించారు.
రోడ్డుపై శానిటైజేషన్ స్ప్రే చేసిన హోంమంత్రి - home minister mahamud ali spray
మలక్‌పేటలో అగ్నిమాపకశాఖ, విపత్తు నివారణశాఖ ఆధ్వర్యంలో ఫైర్ ఇంజిన్లతో శానిటైజేషన్ స్ప్రే చేశారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు.
![రోడ్డుపై శానిటైజేషన్ స్ప్రే చేసిన హోంమంత్రి home minister spray sanitization on the malakpet road](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6867559-770-6867559-1587377595135.jpg)
రోడ్డుపై శానిటైజేషన్ స్ప్రే చేసిన హోంమంత్రి
స్విగ్గి, జోమోటోకు అనుమతి లేదని, ఎవరైనా ఫుడ్ కోసం బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని నగర సీపీ అంజనీకుమార్ అన్నారు. వాహనాలతో సోడియం హైపోక్లోరైడ్ రసాయన ద్రావాణాన్ని వాహనాలతో పిచికారీ చేయించారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బలాల, అగ్నిమాపకశాఖ డీజీ సంజయ్ కుమార్ జైన్, తదితర అధికారులు పాల్గొన్నారు.
రోడ్డుపై శానిటైజేషన్ స్ప్రే చేసిన హోంమంత్రి
ఇదీ చూడండి :లాక్డౌన్లో మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం