రంజాన్ మాసంలో లాక్ డౌన్ నిబంధనలు పాటించినట్టుగానే... రంజాన్ పర్వదినాన్ని జరుపుకోవాలని ముస్లింలకు హోం మంత్రి మహమూద్ అలీ సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, డీజీపీ మహేందర్ రెడ్డి, మూడు కమిషనరేట్ల సీపీలతో సమీక్షించారు.
రంజాన్ పర్వదినాన్ని ఇళ్లలోనే జరుపుకోవాలి: హోం మంత్రి - హోం మంత్రి మహమూద్ అలీ తాజా వార్తలు
రంజాన్ వేళ ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోనే ఉండి ప్రార్థనలు చేసుకోవాలని హోం మంత్రి మహమూద్ అలీ సూచించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా చర్యలపై హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, డీజీపీ మహేందర్ రెడ్డి, మూడు కమిషనరేట్ల సీపీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
రంజాన్ పర్వదినాన్ని ఇళ్లలోనే జరుపుకోవాలి: హోం మంత్రి
లాక్డౌన్ అమల్లో ఉన్నందున కర్ఫ్యూ కొనసాగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ముస్లింలకు హోంమంత్రి మహమూద్ అలీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి:షూటింగ్స్‌కు అనుమతిచ్చిన తెలంగాణ ప్రభుత్వం