తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా అన్ని రకాల చర్యలు: హోంమంత్రి

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారి భద్రత కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హోం మంత్రి మహమూద్​ అలీ వెల్లడించారు. అగ్నిమాపక శాఖ నుంచి కళాశాలలకు ఎన్వోసీ జారీ చేయాల్సిన సమస్య, తదితర అంశాలపై హోంమంత్రి మహమూద్ అలీ, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సమావేశమయ్యారు. లక్షలాది ఇంటర్​ విద్యార్థులపై ప్రభావం చూపే సమస్యను పరిష్కరించడం వంటి అంశాలపై సమీక్షించారు.

విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా అన్ని రకాల చర్యలు: హోంమంత్రి
విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా అన్ని రకాల చర్యలు: హోంమంత్రి

By

Published : Sep 5, 2020, 10:06 PM IST

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారి భద్రత కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హోం మంత్రి మహమూద్ అలీ తెలిపారు. ప్రజల ప్రాణాలను, ఆస్తిని అగ్ని ప్రమాదాల నుంచి రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అగ్నిమాపక శాఖ నుంచి కళాశాలలకు ఎన్వోసీ జారీ చేయాల్సిన సమస్య, ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించేందుకు సీనియర్ అధికార్లతో కలిసి హోంమంత్రి కార్యాలయంలో మహమూద్ అలీ, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సమావేశమయ్యారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పరిధిలోని కళాశాలలకు అనుమతి ఇవ్వడం, లక్షలాది ఇంటర్​ విద్యార్థులపై ప్రభావం చూపే సమస్యను పరిష్కరించడం వంటి అంశాలపై సమీక్షించారు.

కొవిడ్ -19 ప్రభావం వల్ల విద్యార్తుల భవిష్యత్తును పరిగణనలోకి తీసుకొని చట్టం, దాని నిబంధనలకు అనుగుణంగా అగ్నిమాపక శాఖ సమస్యకు పరిష్కారం చూపాలని విద్యా శాఖ మంత్రి సబితా కోరారు.

ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details