తెలంగాణ

telangana

ETV Bharat / state

కేంద్ర హోంమంత్రి పతకానికి సీబీఐ హైదరాబాద్​ ఎస్పీ ఎంపిక - సీబీఐ హైదరాబాద్ ఎస్పీ సి.కళ్యాణ్

దేశంలోని పలు కేసుల దర్యాప్తుల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన 121 మంది పోలీసు అధికారులు కేంద్రహోంమంత్రి పతకానికి ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి సీబీఐ హైదరాబాద్​ ఎస్పీ సి.కళ్యాణ్​కు కేంద్రం అవార్డు ప్రకటించింది.

home minister medal to cbi sp c.kalyan
కేంద్ర హోంమంత్రి పతకానికి సీబీఐ హైదరాబాద్​ ఎస్పీ ఎంపిక

By

Published : Aug 12, 2020, 5:21 PM IST

సీబీఐ హైదరాబాద్ ఎస్పీ సి.కళ్యాణ్ పాకెర్ల కేంద్ర హోంమంత్రి పతకానికి ఎంపికయ్యారు. దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన వివిధ విభాగాల సిబ్బందికి ప్రతీ ఏడాది కేంద్ర హోంమంత్రి దర్యాప్తు పతకాలను ఇస్తోంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 121 మంది దర్యాప్తు అధికారులకు పతకాలను ప్రకటించింది. సీబీఐ హైదరాబాద్ విభాగానికి నేతృత్వం వహిస్తున్న ఎస్పీ కళ్యాణ్​కు కేంద్రం అవార్డు ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details