తెలంగాణ

telangana

ETV Bharat / state

అమరవీరులకు హోంమంత్రి మహమూద్​ అలీ నివాళి - Telangana State Portal Police Commemoration Day 2019

శాంతి భద్రతలు ఉంటేనే ఏ దేశమైన అభివృద్ధి చెందుతుందని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సావాల్లో ఆయన పాల్గొన్నారు.

అమరవీరులకు హోంమంత్రి మహమూద్​ అలీ నివాళి

By

Published : Oct 21, 2019, 12:30 PM IST

Updated : Oct 21, 2019, 1:26 PM IST

గోషామహల్ మైదానంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి మహమూద్​ అలీ పాల్గొన్నారు. అమరవీరులకు నివాళులు అర్పించారు. శాంతి భద్రతల విషయంలో రాష్ట్ర పోలీసులు ఏ మాత్రం రాజీ పడకుండా విధులు నిర్వర్తిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు కేటాయించే సమయాన్ని కూడా ప్రజల రక్షణకే పోలీసులు ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఆరోగ్య పరంగా తగిన జాగ్రత్తలు తీసుకునే సమయం వారికి ఉండట్లేదని... అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య భద్రత వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను పోలీసులకు అందిస్తుందని హోంమంత్రి వెల్లడించారు.

అమరవీరులకు హోంమంత్రి మహమూద్​ అలీ నివాళి
Last Updated : Oct 21, 2019, 1:26 PM IST

ABOUT THE AUTHOR

...view details