దేశంలో ఎక్కడ లేని విధంగా అద్భుతమైన టెక్నాలజీ వాడుకుని హైదరాబాద్ పంజాగుట్ట ఉక్కు వంతెనను నిర్మించారని హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న ట్రాఫిక్ సమస్యలు తొలిగిపోవడానికి ఈ బ్రిడ్జి ఉపయోగపడుతుందని తెలిపారు. పంజాగుట్ట ఉక్కు వంతెనను హోంమంత్రి మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ కలిసి ఇవాళ ప్రారంభించారు. లాక్డౌన్ సమయాన్ని అద్భుతంగా వినియోగించుకుని రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేశారని స్పష్టం చేశారు.
ఉక్కు వంతెన ప్రారంభం... తప్పనున్న ట్రాఫిక్ సమస్యలు - Home Minister Mahmoud Ali bridge open
హైదరాబాద్ పంజాగుట్టలో ఉక్కు వంతెనను హోంమంత్రి మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ ప్రారంభించారు. దీనితో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మార్గంలో ట్రాఫిక్ సమస్య తీరనుంది.

పంజాగుట్టలో ఉక్కు వంతెనను ప్రారంభించిన హోంమంత్రి
ప్రపంచంలో ప్రతి ఒక్కరు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు. ఇక్కడి పోలీస్ వ్యవస్థ, భద్రత వల్ల ఇక్కడికి వచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు. 6 కోట్ల రూపాయల బల్దియా నిధులతో పంజాగుట్ట శ్మశానవాటిక వద్ద ఈ ఉక్కు వంతెన నిర్మాణం జరిగింది. పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మార్గంలో ఇకపై ట్రాఫిక్ సమస్య తీరనుంది
ఉక్కు వంతెన ప్రారంభం... తప్పనున్న ట్రాఫిక్ సమస్యలు
ఇదీ చదవండి:మహానగరంలో కరోనా మహమ్మారి విజృంభణ..!
Last Updated : Jun 19, 2020, 2:24 PM IST