రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్.. వెంటనే హోం మంత్రి మహమూద్ అలీ ఓటును రద్దు చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. తాను.. తెరాస అభ్యర్ధి వాణీదేవికే ఓటు వేశానని చెప్పి.. మంత్రి ఓటర్లని మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ఆయన మండిపడ్డారు.
'రాష్ట్రంలో అసలు ఎన్నికల ప్రధానాధికారి ఉన్నారా..?' - హోం మంత్రి మహమూద్ అలీ
రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ వ్యాఖ్యలను ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఖండించారు. తాను.. తెరాస అభ్యర్ధి వాణీదేవికే ఓటు వేశానని చెప్పి.. మంత్రి ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.
'రాష్ట్రంలో అసలు ఎన్నికల ప్రధానాధికారి ఉన్నారా..?'
నేడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పరిణామాలను చూస్తుంటే.. అసలు రాష్ట్రంలో ఎన్నికల ప్రధానాధికారి ఉన్నారా.. అన్న అనుమానం కలుగుతోందని శ్రవణ్ విమర్శించారు. ఏ పోలింగ్ కేంద్రం వద్ద చూసినా తెరాస కార్యకర్తలు.. పార్టీ కండువాలు, గులాబీ టోపీలు, చొక్కాలు, కరపత్రాలతో ఇష్టారాజ్యంగా ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంటే.. అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు.