హైదరాబాద్ పాతబస్తీ మీర్‌చౌక్‌లో భరోసా సెంటర్కు హోం శాఖ మంత్రి మహమూద్ అలీ భూమి పూజ చేశారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత శాంతిభద్రతలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా భద్రతే ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నారని చెప్పారు. భరోసా సెంటర్ ఏర్పాటుతో మహిళల సమస్యలు త్వరగా తీరుతున్నాయన్నారు.
మహిళల కోసం షీ టీమ్స్ చాలా బాగా పనిచేస్తున్నాయని హోంమంత్రి ప్రశంసించారు. కోటి 8 లక్షలతో నగరంలోని జహీరానగర్‌లో రెండో భరోసా సెంటర్ ఏర్పాటు అవుతుందన్నారు. లాక్‌డౌన్ సమయంలో పోలీసులు చాలా కృషి చేశారని ఎంపీ అసదుద్దీన్ పేర్కొన్నారు. మహిళల పట్ల గౌరవం ఉండాలని ఖురాన్ కూడా బోధిస్తుందని ఎంపీ వివరించారు.