తెలంగాణ

telangana

ETV Bharat / state

Osmania University: ఓయూ లోగోను మార్చలేదు: హోంమంత్రి - ఓయూ యూనివర్సిటీ వార్తలు

ఉస్మానియా విశ్వవిద్యాలయం లోగోపై హోంమంత్రి మహమూద్​ అలీ స్పష్టత ఇచ్చారు. లోగోను తెరాస ప్రభుత్వం మార్చేసినట్లు పలువురు నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఎలాంటి మార్పులు చేయలేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వంపై కొందరు అనవసరంగా నిందలు వేస్తున్నారని హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

home-minister-mahmood-ali-on-osmania-university-logo
Osmania University: ఓయూ లోగోను మార్చలేదు: హోంమంత్రి

By

Published : Jun 15, 2021, 10:43 AM IST

ఉస్మానియా విశ్వవిద్యాలయం లోగో(Osmania University Logo)ను తెలంగాణ ప్రభుత్వం మార్చలేదని హోంమంత్రి మహమూద్‌ అలీ(Home Minister Mahmood Ali) స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయం లోగోను ప్రభుత్వం మార్చేసిందని కొందరు నేతలు చేస్తున్న విమర్శలపై హోంమంత్రి స్పందించారు.

సీఎం కేసీఆర్‌ సెక్యులర్‌ నాయకుడని, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తారని మహమూద్​ అలీ తెలిపారు. లోగో విషయమై వివరాలు తెలుసుకునేందుకు ఉర్దూ విభాగం ఆచార్యులు షుకూర్‌కు బాధ్యతలు అప్పగించినట్టు వివరించారు. ప్రభుత్వంపై కొందరు అనవసరంగా నిందలు వేస్తున్నారని, 1960 సంవత్సరం తర్వాత ధృవపత్రాలు ఉన్నవారు లోగోను గమనించవచ్చని... నిరాధారమైన వార్తలు నమ్మవద్దని మహమూద్‌ అలీ విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:Tragedy: రూ.80 లక్షలు ఖర్చు చేసినా.. కుటుంబంలో ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details