మలక్‌పేట సర్కిల్ అజంపురలో డివిజన్‌లో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా ప్రాముఖ్యమైనదని.. అందరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలని సూచించారు.
అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి: హోంశాఖ మంత్రి - ghmc polls 2020
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో తెరాస పార్టీని గెలుపిస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ప్రజలకు టీఆర్‌ఎస్ పార్టీపై నమ్మకముందని హోంమంత్రి పేర్కొన్నారు. మలక్‌పేట సర్కిల్ అజంపురలో డివిజన్‌లో ఆయన కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.
![అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి: హోంశాఖ మంత్రి home minister mahmood ali Everyone should exercise the right to vote](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9723535-662-9723535-1606809275217.jpg)
అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి: హోంశాఖ మంత్రి
అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి: హోంశాఖ మంత్రి
బల్డియా ఎన్నికల్లో వందకుపైగా డివిజన్‌లు తెరాస కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని... ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు.
ఇదీ చూడండి :గ్రేటర్‌లో ఓటేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు