తెలంగాణ

telangana

ETV Bharat / state

పిల్లలను సరిదిద్దే బాధ్యత తల్లిదండ్రులదే: మహమూద్‌ అలీ

MAHAMOOD Ali: పిల్లలు తప్పుదారి పడుతున్నారని తల్లిదండ్రులే వారిని దారిలో పెట్టాలని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. పిల్లలను స్వేచ్ఛగా వదిలేయడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి ఆయన అన్నారు.

మహమూద్ అలీ
మహమూద్ అలీ

By

Published : Jun 8, 2022, 8:34 PM IST

MAHAMOOD Ali: పిల్లలు తప్పుదారి పడుతున్నారని తల్లిదండ్రులే వారిని సరైన దారిలో పెట్టాలని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. పిల్లలను స్వేచ్ఛగా వదిలేయడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయని చెప్పారు. నాంపల్లిలోని హజ్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టబోమని స్పష్టంచేశారు. ఏదైనా మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలని ప్రతిపక్షాలకు హోంమంత్రి మహమూద్ అలీ హితవు పలికారు.

"కాలం మారింది. ప్రజల చేతిలోకి ఫోన్లు, వాట్సాప్‌లు వచ్చాయి. పిల్లలు పక్కదారి పడుతున్నారు. తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలి. అందరు తల్లిదండ్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీ అబ్బాయిలు, అమ్మాయిలపై కొంచెం దృష్టిపెట్టండి. వారిని అలా వదిలిపెట్టకండి. స్వేచ్ఛగా వదిలేయడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. మీ పిల్లల్ని నియంత్రణలో ఉంచండి." - మహమూద్ అలీ,హోంమంత్రి

పిల్లలను సరిదిద్దే బాధ్యత తల్లిదండ్రులదే

ABOUT THE AUTHOR

...view details