హైదరాబాద్ పాతబస్తీ చాదర్‌ఘాట్‌లో ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గులకు కఠినంగా శిక్షిస్తామని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. జియాగూడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి... అత్యాచార ఘటనపై స్పందించారు. పాతబస్తీ అత్యాచార ఘటనపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ చేస్తామని తెలిపారు.
అత్యాచార నిందితులకు ఉరిశిక్ష వేయిస్తాం : హోం మంత్రి
హైదరాబాద్ పాతబస్తీ చాదర్‌ఘాట్‌లో ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు ఉరిశిక్ష పడేలా చేస్తామని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. జియాగూడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి... అత్యాచార ఘటనపై స్పందించారు.
హోం మంత్రి మహమూద్ అలీ
నిందితులకు కచ్చితంగా ఉరిశిక్ష పడేలా చేస్తామని హోంమంత్రి చెప్పారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మహమూద్ అలీ తెలిపారు. బాధితురాలిని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి:మాజీ మంత్రి రత్నాకర్‌రావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం