కరోనా బారిన పడిన ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని యూసుఫైన్ దర్గాలో ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రితోపాటు పలువురు తెరాస నేతలు, స్థానికనేతలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని... ఆయన కుటుంబంలో అందరు క్షేమంగా ఉండాలని హోంమంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రంలో కర్ప్యూ పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆలోచన లేదని.. కానీ హైకోర్టు ఆదేశాల ప్రకారం కర్ఫ్యూ పెట్టినట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కర్ప్యూ విధించాయని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలని హోంమంత్రి ప్రార్థనలు - telangana varthalu
ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఆయన కుటుంబం క్షేమంగా ఉండాలని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని హైదరాబాద్ నాంపల్లిలోని యూసుఫైన్ దర్గాలో ప్రార్థనలు చేశారు.
కరోనా మొదటి దశ కంటే రెండో దశ ప్రమాదకరంగా ఉందని... ఇది త్వరగా వ్యాప్తి చెందుతుందన్నారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని ప్రజలకు సూచించారు. మాస్క్ ధరించని వారికి భారీగా జరిమానా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటలకు వరకు కర్ప్యూ ఉంటుందని...అందరూ ప్రభుత్వ ఆదేశాలను పాటించాలన్నారు. ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఉండవద్దని...ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలన్నారు.
ఇదీ చదవండి: రాత్రి కర్ఫ్యూ పక్కాగా అమలు చేయాలి: డీజీపీ మహేందర్ రెడ్డి