తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్వాన్​ నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మహమూద్​ అలీ - hyderabad news

కార్వాన్​ నియోజకవర్గంలో తెరాస పార్టీ కార్యాలయాన్ని హోంమంత్రి మహమూద్​ అలీ తమ చేతుల మీదుగా ప్రారంభించారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల కోసం నాయకులు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.

home minister mahamood ali opened trs party office  in Karwan constituency
కార్వాన్​ నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మహమూద్​ అలీ

By

Published : Nov 8, 2020, 6:59 PM IST

హోంమంత్రి మహమూద్​ అలీ తమ చేతుల మీదుగా కార్వాన్ నియోజకవర్గంలో తెరాస పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. రానున్న రెండు నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు రానున్నాయని.. నాయకులు సిద్ధంగా ఉండాలని మంత్రి తెలిపారు. తెలంగాణ విద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలతో పాటు అనేక రంగాల్లో ముందంజలో ఉందన్నారు. ఈ ఘనత సీఎం కేసీఆర్​కు మాత్రమే దక్కుతుందని మంత్రి మహమూద్​ అలీ అన్నారు.
ఈ సందర్భంగా 50 మంది తెరాస పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కార్వాన్​ నియోజకవర్గ తెరాస ఇన్​చార్జి జీవన్ సింగ్, కార్పొరేటర్ మిత్రకృష్ణ, సీనియర్ నాయకులు ముత్యాల భాస్కర్, కావూరి వెంకటేష్, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details