రాష్ట్రంలో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు నగరంలో శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కృషిచేస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ తెలిపారు. హైదరాబాద్ బేగంపేటలో సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఐదో వార్షికోత్సవ సదస్సుకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీల కోసం శిక్షణా కేంద్రం : హోంమంత్రి
ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలు ప్రజల భద్రతా విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. హైదరాబాద్లో సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఐదో వార్షికోత్సవం సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రైవేటు సెక్యూరిటీ రంగం ద్వారా ఏటా నాలుగు లక్షల మంది ఉపాధి అవకాశాలు పొందుతున్నారని హోం మంత్రి తెలిపారు. అంతేకాక ప్రతి సంవత్సరం 25 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకోవడం అభినందనీయమన్నారు. ప్రజల రక్షణలో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు కీలక భూమిక పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి అంశం పోలీసులపై ఆధారపడకుండా ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలు ప్రభుత్వానికి సాయం చేస్తున్నాయన్నారు. ఏజెన్సీలలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి బస్, రైళ్లలో పాసులు అందించే విషయంపై ముఖ్యమంత్రితో చర్చిస్తామని తెలిపారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన సెక్యూరిటీ ఏజెన్సీలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ రాములు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: హాజీపూర్ వరుస హత్యల కేసు విచారణ పూర్తి