తెలంగాణ వస్తే గొడవలు, అల్లర్లు జరుగుతాయని ఆరోపణలు చేసిన వారికి ముఖ్యమంత్రి కేసీఆర్.. అభివృద్ధితో విమర్శకుల నోళ్లు మూయించారని హోంమంత్రి మహమూద్ అలీ వ్యాఖ్యానించారు. టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఎల్బీ స్టేడియంలో జరిగే క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడా ప్రాధికారక సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, టీఎన్జీవో మాజీ నాయకుడు దేవీప్రసాద్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అభివృద్ధితో విమర్శకుల నోళ్లు మూయించాం: హోంమంత్రి - టీఎన్జీవో హైదరాబాద్
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మూడు రోజుల పాటు జరిగే క్రీడా పోటీలను హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరిగా అలవరచుకోవాలని హోం మంత్రి సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అన్ని వర్గాలను కలుపుకొని రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు.
మానసిక ఉల్లాసానికి వ్యాయామం తప్పనిసరి: మహమూద్ అలీ
నాలుగు గోడల మధ్య అనునిత్యం ఒత్తిడితో పనిచేసే వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ఈ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని మహమూద్ అలీ అన్నారు. ఉద్యోగులు ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరిగా అలవర్చుకోవాలని సూచించారు. ఉద్యోగులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొవడం వల్ల కరోనా సమయంలో కూడా వైరస్ సోకకుండా జాగ్రత్తగా పనిచేశారని హోంమంత్రి తెలిపారు.
ఇదీ చదవండి:ఐటీ పార్క్‌కు సీఎం శ్రీకారం.. రైతు వేదికల ప్రారంభోత్సవం