శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులకు సీఎం అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. హైదరాబాద్ గోల్కొండలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 170 కమ్యూనిటీ సీసీ కెమెరాలను కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్‌తో కలిసి ప్రారంభించారు.
సీసీ కెమెరాలతో శాంతిభద్రతలు పటిష్ఠం: హోం మంత్రి - హోం మంత్రి మహమూద్ అలీ తాజా వార్తలు
ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. హైదరాబాద్ ఆసిఫ్‌నగర్ ఏసీపీ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 170 కమ్యూనిటీ సీసీ కెమెరాలను కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్‌తో కలిసి ప్రారంభించారు.
సీసీ కెమెరాలు ప్రారంభించిన హోం మంత్రి మహమూద్ అలీ
ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలకు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. సీసీ కెమెరాల కారణంగానే శాంతిభద్రతలను పటిష్ఠంగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ఆరేళ్లలో టీఎస్‌పీఎస్సీపై ఒక్క ఆరోపణ కూడా రాలేదు: సీఎస్