బక్రీద్ పండగ ఈ సంవత్సరం ప్రత్యేక పరిస్థితుల మధ్య జరగనుందని హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా ముస్లిం సోదరులు ప్రత్యేక శ్రద్ధ వహించి.. పండుగ జరుపుకోవాలని సూచించారు. ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని.. అక్కడ కూడా భౌతిక దూరం, మాస్కులు ధరించడం విధిగా పాటించాలని కోరారు.
ఆగస్టు 1న జరగనున్న బక్రీద్ పండగ ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, జోనల్ కమిషనర్లతో మంత్రి సమీక్షించారు. పండగ సందర్భంగా బలిచ్చే జంతువుల వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు జీహెచ్ఎంసీ తగిన ఏర్పాట్లు చేసిందని కమిషనర్ లోకేశ్‌కుమార్ మంత్రికి వివరించారు. వీటి కోసం ప్రత్యేక వాహనాలు, అదనపు సిబ్బందిని నియమించామని తెలిపారు.