తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కిషన్​రెడ్డి - భాజపా నేత కిషన్​రెడ్డి తెలంగాణ వార్తలు

వాయుగుండం ప్రభావంతో రానున్న రెండు రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయని.. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డి విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారు వీలైనంత త్వరగా సురక్షిత కేంద్రంలోకి తరలివెళ్లాలని మంత్రి కోరారు.

home minister kishan reddy on rains in telanagana
'తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి': కిషన్​రెడ్డి

By

Published : Oct 13, 2020, 9:55 PM IST

మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని.. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డి విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని సూచించారు. పురాతన, శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో నివసించేవారు, లోతట్టు కాలనీవాసులు వెంటనే సమీప కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వం సిఫారసు చేసిన సురక్షిత కేంద్రంలో ఉండాలని కోరారు.

భారీ వర్షాలు, వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు ఎన్​డీఆర్ఎఫ్​ సిబ్బంది ఇప్పటికే పనిచేస్తోందని.. వీరితో పాటు పారామిలటరీని సిద్ధం చేసినట్లు మంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండి, ఎప్పటికప్పుడు వరదలపై సహాయక కేంద్రాలకు సమాచారం ఇవ్వాలని కిషన్​రెడ్డి కోరారు.

ఇదీ చదవండి:భాగ్యనగరంలో భారీ వర్షం.. స్తంభించిన జనజీవనం

ABOUT THE AUTHOR

...view details