లాక్‌డౌన్‌పై హోంమంత్రి మహమూద్అలీ క్షేత్ర పర్యటన - తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ
కరోనా వ్యాప్తి నేపథ్యంలో భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో హోంమంత్రి మహమూద్ అలీ పర్యటించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదాపుర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ కూడలిలో లాక్‌డౌన్ పరిస్థితిని పరిశీలించారు. అలాగే రాయదుర్గం పోలీస్ స్టేషన్‌ను మంత్రి సందర్శించారు. లాక్‌డౌన్ పరిస్థితిపై సీపీ సజ్జనార్‌ను అడిగి తెలుసుకున్నారు. చెక్‌పోస్టుల ఏర్పాటు, అత్యవసర, నిత్యావసర సేవలపై హోంమంత్రి ఆరా తీశారు.
![లాక్‌డౌన్‌పై హోంమంత్రి మహమూద్అలీ క్షేత్ర పర్యటన Telangana Home Minister examining lockdown situation in Hyderabad latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6549049-1099-6549049-1585212492609.jpg)
Telangana Home Minister examining lockdown situation in Hyderabad latest news
.
భాగ్యనగరంలో లాక్‌డౌన్ పరిస్థితిని పరిశీలించిన హోంమంత్రి