తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేసీఆర్‌ సచివాలయానికి వెళ్తే... మేం ఏమిచ్చామో తెలుస్తది' - Ghmc elections 2020

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపాకు అవకాశమివ్వాలని ప్రజలను కోరారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​షా. గ్రేటర్​ హైదరాబాద్ ఎన్నికల్లో భాగంగా నగరానికి వచ్చిన ఆయన...ఎంఐఎం, తెరాసపై విమర్శలు గుప్పించారు.

కేసీఆర్‌ సచివాలయానికి వెళ్తే కదా... మేం ఏమిచ్చామో తెలిసేది: అమిత్​షా
కేసీఆర్‌ సచివాలయానికి వెళ్తే కదా... మేం ఏమిచ్చామో తెలిసేది: అమిత్​షా

By

Published : Nov 29, 2020, 4:09 PM IST

​కేసీఆర్‌ సచివాలయానికి వెళ్తే కదా... ఎన్ని నిధులు వచ్చాయో తెలిసేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా చురకలంటించారు. గల్లీ ఎన్నికలు అనేవారు గల్లీలను ఎందుకు బాగు చేయలేదని ఆయన ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

తనకు స్వాగతం పలికిన హైదరాబాద్ ప్రజలకు అమిత్​షా ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌ మేయర్‌ పీఠం భాజపాదేనని ధీమా వ్యక్తం చేశారు. భాజపాకు అవకాశమిస్తే అవినీతిని పారద్రోలుతామన్న ఆయన... మేకిన్​ ఇండియా ఫలాలు హైదరాబాద్​లో కనిపిస్తున్నాయన్నారు.

హైదరాబాద్‌ వరదల్లో 7 లక్షల మంది జనం ఇబ్బందులు పడ్డారు. వరదలు వచ్చి కష్టాల్లో ఉన్నప్పుడు కేసీఆర్‌, ఓవైసీ ఎందుకు రాలేదు. ఒక్కసారి భాజపాకు అవకాశం ఇవ్వండి. నాలాలపై అక్రమ నిర్మాణాలను తొలగిస్తాం. మంచి పరిపాలన అందిస్తామని వాగ్దానం చేస్తున్నా. మేం వాగ్దానం చేశామంటే... అమలు చేసి తీరుతాం. హైదరాబాద్‌ మినీ భారత్‌ లాంటిది. దేశం నలుమూలల నుంచి ఇక్కడకు వస్తారు. రాజకీయాల్లో పొత్తులు సహజం. ఎవరు ఎవరితోనైనా ఒప్పందం చేసుకోవచ్చు. కానీ మజ్లిస్‌తో తెరాసకు చాటుమాటు ఒప్పందాలు ఎందుకు?

--- కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా

ABOUT THE AUTHOR

...view details