Home Minister Amit Shah Visit is Finalised in Telangana :రాష్ట్రంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ(BJP) కేంద్ర అధినాయకత్వం పావులు కదుపుతోంది. స్వయంగా కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా(Amit Shah) రంగంలోకి దిగారు. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కైవసమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్ధేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా రాష్ట్ర పర్యటన ఖరారైంది. ఈ నెల 28న రాష్ట్రానికి రానున్నారు.
'గ్రామీణ ప్రజలను దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయడమే భారత్ వికాస్ సంకల్ప యాత్ర లక్ష్యం'
కరీంనగర్, మహాబూబ్‌నగర్, సికింద్రాబాద్ క్లస్టర్ సమావేశాల్లో పాల్గొననున్నారు. కరీంనగర్, మహాబూబ్‌నగర్, సికింద్రాబాద్ క్లస్టర్ సమావేశాలను విజయవంతం చేసేందుకు రాష్ట్ర నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మండలాధ్యక్షుల స్థాయి నుంచి నేతల వరకు క్లస్టర్ సమావేశాలకు రావాలని రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చింది. 17 పార్లమెంట్ స్థానాలను ఐదు క్లస్టర్లుగా బీజేపీ విభజించింది. మూడు క్లస్టర్ సమావేశాలకు అమిత్ షా హాజరవుతుండగా మిగతా రెండు క్లస్టర్ సమావేశాలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) రానున్నారు. ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటివారంలో జేపీ నడ్డా రాష్ట్రానికి వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.