తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈటీవీ భారత్ ఎఫెక్ట్.. హోం ఐసొలేషన్ బాధితులకు టోల్ ఫ్రీ నెంబర్ - ఐసొలేషన్ బాధితులకు అందుబాటులోకి టోల్ ఫ్రీ నంబరు

ఇళ్లలో ఐసోలేషన్ ఉంటూ అవస్థలు పడుతున్నారంటూ జులై 8న ఈటీవీ భారత్​లో బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు 'హోం ఐసోలేషన్.. ఇరుకు ఇళ్లలో బాధితుల పరేషాన్!' శీర్షికన ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బాధితుల కోసం శుక్రవారం టోల్ ఫ్రీ కొవిడ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగిన సూచనలు అందజేయనున్నట్లు పేర్కొంది.

home isolation covid victims got toll free number
ఐసొలేషన్ బాధితులకు అందుబాటులోకి టోల్ ఫ్రీ నంబరు

By

Published : Jul 11, 2020, 7:12 AM IST

ఇళ్లలో ఐసోలేషన్ ఉంటూ అవస్థలు పడుతున్న కొవిడ్ బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బాధితుల కోసం శుక్రవారం టోల్ ఫ్రీ కొవిడ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగిన సూచనలు అందజేయనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే హోం ఇసాలేషన్ నెంబరు- 18005804455 ను అందుబాటులోకి తీసుకువచ్చారు. తీవ్రమైన శ్వాస సంబంధ సమస్యలు, ఛాతీ నొప్పి ఎవరైనా బాధపడుతుంటే ఈ నంబరుకు ఫోన్ చేయాలని శాఖ సూచించింది. ఈనెల 8న 'హోం ఐసోలేషన్.. ఇరుకు ఇళ్లలో బాధితుల పరేషాన్!' శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చపట్టింది. బాధితుల అవసరాన్ని బట్టి వారి గృహాలకు వెంటనే 108 అంబులెన్స్​ను పంపించి మెరుగైన వైద్యం కేసం ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ శాఖ స్పష్టం చేసింది.

రోగికి సేవలందించే వారు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగిన సూచనలు అందజేయనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే హోం ఐసోలేషన్​లో ఉండేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కాల్​ సెంటర్​ ద్వారా నిత్యం కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలిపింది. రోజువారీ 17 రోజులపాటు బాధితులతో నిపుణులు మాట్లాడుతున్నారని, లక్షణాలను బట్టి టెలీ మెడిసిన్ ద్వారా సూచనలు జారీ చేస్తున్నారని పేర్కొంది. హోం ఐసోలేషన్​లో రాష్ట్రంలో సుమారు 10 వేల మంది రోగులు ఉన్నారని, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు నిత్యం అందిస్తున్నట్లు పేర్కొంది. కొవిడ్​కు సంబంధించిన సలహాలు, సందేహాలను కాల్ సెంటర్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చని ఆరోగ్య శాఖ సూచించింది

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details