లాక్డౌన్ నేపథ్యంలో హోటల్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు మూసి ఉండడం వల్ల శునకాలకు తిండి లభించని పరిస్థితి ఏర్పడింది. గమనించిన హైదరాబాద్ లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్లో హోంగార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న సురేష్ చలించిపోయాడు.
వీధి శునకాలకు ఆహార మందిస్తున్న హోంగార్డ్ - dogs
హైదరాబాద్ లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్లో హోంగార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న సురేష్ జంతువులపై తనకున్న ప్రేమను చూపిస్తున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న శునకాలకు ఆహారం అందిస్తున్నాడు.

వీధి శునకాలకు ఆహారమందిస్తున్న హోంగార్డ్
విధులు పూర్తయ్యాక ఇంటికి వెళ్లే దారిలో కనిపించే ప్రతి శునకానికి.. బ్రెడ్ ప్యాకెట్లను ఆహారంగా అందిస్తున్నాడు. సుమారు 10 నుంచి 20 బ్రెడ్ ప్యాకెట్లను... ప్రతి రోజు వీధి శునకాలకు అందించి జంతువులపై ఉన్న ప్రేమను చూపిస్తున్నాడు.
ఇవీ చూడండి: ఆన్లైన్లో మాయ మాటలు.. మహిళకు రూ.9 లక్షలు టోకరా