లాక్‌డౌన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోఇళ్ల నుంచి బయటకు రాలేని వారికి మందులను వారి ఇంటికే పంపిణీ చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెడ్‌జోన్లలో ఉండి మందులు అవసరమైనప్పటికీ తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఔషధ నియంత్రణ శాఖ చెప్పిన నంబర్లు, ఈమెయిల్స్ ద్వారా దుకాణాల వారిని సంప్రదించి నగదుతో తెప్పించుకునేలా చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలోని గుంటూరు జిల్లాలో మందుల దుకాణాల వివరాలను ఔషధ నియంత్రణ శాఖ అధికారులు వార్డు, సచివాలయ సిబ్బందికి అందచేస్తున్నారు. ఇలా గుంటూరు జిల్లాలో 81 మందుల షాపులను గుర్తించారు. ఇందులో 34 గుంటూరు నగరంలోనే ఉన్నాయి. ఇలాగే కర్నూల్ జిల్లాలోనూ చేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లోనూ ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మందుల కొరత రానివ్వద్దు
కొవిడ్-19 నేపథ్యంలో సాధారణ మందులకు కొరత ఏర్పడకుండా చూడాలని జాతీయ ఔషధ నియంత్రణ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. రక్తపోటు, చక్కెర వ్యాధి, కడుపునొప్పి, ఇతర రోగాలకు సంబంధించిన మందులను కొనుగోలుదారులకు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని సూచించింది. 54 రకాల మందుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. ఈ మందులు ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయని రాష్ట్ర అధికారులు తెలిపారు.
తగ్గిన హడావుడి!