తెలంగాణ

telangana

By

Published : May 4, 2021, 3:25 PM IST

ETV Bharat / state

రేపటి నుంచి పాలిటెక్నిక్​ కళాశాలలకు సెలవులు: నవీన్​ మిత్తల్

పాలిటెక్నిక్​ కళాశాలలకు రేపటి నుంచి సెలవులు ప్రకటిస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్​ నవీన్​ మిత్తల్​ వెల్లడించారు. ఈ మేరకు సవరించిన అకాడమిక్ షెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపారు.​

పాలిటెక్నిక్​ కళాశాలలకు సెలవులు
పాలిటెక్నిక్​ కళాశాలలకు సెలవులు

రాష్ట్రంలోని పాలిటెక్నిక్​ కళాశాలలకు సాంకేతిక విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. రేపటి నుంచి ఈ నెల 31 వరకు సెలవులు ఉంటాయని ప్రకటించింది. ఈ మేరకు సవరించిన అకాడమిక్​ షెడ్యూల్​ ప్రకటిస్తామని ఆ శాఖ కమిషనర్​ నవీన్ మిత్తల్ తెలిపారు.

మరోవైపు కరోనా ఉద్ధృతి దృష్ట్యా గత నెల 27 నుంచే రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 వరకు సెలవులు కొనసాగుతాయని ప్రకటించింది.

ఇదీ చూడండి: ఈటల కుటుంబం అత్యవసర పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

ABOUT THE AUTHOR

...view details