పరిషత్ ఎన్నికల సందర్భంగా ఈనెల 8న సెలవు ప్రకటిస్తూ.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, సంస్థలకు సెలవు ప్రకటించింది. ప్రభుత్వ సంస్థలకు సెలవు ప్రకటించాలని కలెక్టర్లను ఆదేశించింది. పోలింగ్ రోజున స్థానిక దుకాణాలు, వాణిజ్య సంస్థలకు మూసేయాలని తెలిపింది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో 48 గంటలు ముందుగానే మద్యం దుకాణాలను మూసివేయించాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులిచ్చారు.
ఏపీలో ఆ రెండ్రోజులు సెలవులు
ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా ఈనెల 8న సెలవు ప్రకటిస్తూ.. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో 48 గంటలు ముందుగానే మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశాలిచ్చింది.
ap news, ap election
ఎన్నికల విధులకు ప్రభుత్వ వాహనాలను వినియోగించాలని వెల్లడించారు. ప్రభుత్వ సిబ్బంది, ఉద్యోగులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నికల్లో అభ్యర్ధి తరఫున ప్రచారం చేసినట్లు గుర్తిస్తే... సర్వీసు నిబంధనలు, ప్రవర్తనా నియమావళి కింద క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఆదేశాల్లో పేర్కొంది.
ఇదీచదవండి:పరిషత్ ఎన్నికల్లో ఎడమచేతి చిటికెన వేలుకు సిరా ముద్ర: ఎస్ఈసీ