సోమవారం హోలీ పండుగ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో వ్యాపారస్థులు రంగుల అమ్మకాలను సిద్ధం చేశారు. బేగంబజార్లో విభిన్న రంగులు, పిచికారీ పరికరాలు, తలపాకాలు, మిఠాయిలను విక్రయించేందుకు పెట్టారు. అయితే కరోనా వ్యాప్తి తీవ్రత దృష్ట్యా అమ్మకాలు లేకపోవడంతో వ్యాపారస్థులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది కూడా ఎలాంటి వ్యాపారం కొనసాగలేదని.. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొందని వాపోయారు.
కరోనా ఎఫెక్ట్: వినియోగదారులు లేక రంగుల దుకాణాలు వెలవెల.! - holi colours shops in begum bazar
భాగ్యనగరంలో హోలీకి రంగోళీ అమ్మకాలు మొదలయ్యాయి. వ్యాపారస్థులు విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ కొనేవారు కరవై దుకాణాలు వెలవెలబోతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా వర్తకులకు ఈ ఏడాది కూడా నష్టం తప్పేలా లేదు.
హోలీ దుకాణాలు, బేగం బజార్
నిరుడు మిగిలిపోయిన రంగులనే ఈ సంవత్సరం అమ్ముతున్నామని చెప్పారు. ఇవే కాకుండా రాఖీలు, వినాయక విగ్రహాలు, పతంగులు లాంటి పలు రకాల వ్యాపారాలు చేస్తామని.. కానీ అమ్మకాలు లేకపోవడంతో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:కమ్యూనిస్టు పార్టీలకు లేఖలు రాసిన రాష్ట్ర కాంగ్రెస్