తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా వేళ.. హోలీ ఇలా ట్రై చేయండి! - తెలంగాణ వార్తలు

ఒకవైపు కరోనా.. మరోవైపు రంగుల పండుగ. ఆనందంతో రంగులను పూసుకోవడానికి ఏడాది నుంచి ఎదురు చూసే పండుగ. వైరస్ పుణ్యమా అని గతంలో మాదిరిగా బయట తిరుగుతూ జరుపుకోలేం. అలాగని ఇంట్లో ఉండలేం. కరోనా వల్ల జీవితంలో కొత్త రంగులేవి లేవు... కనీసం ఒక్కరోజైనా రంగురంగుల పండుగను జరుపుకోవాలని అనుకుంటారు చాలా మంది. అయితే కరోనా కాలంలో బయట తిరిగితే అనర్థాలే. అందుకే ఈ సారికి కొత్తగా హోలీ ట్రై చేద్దాం. అదే ఎలాగో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయండి.

holi celebrations 2021, holi special story
హోలీ పండుగ 2021, కరోనా వేళా హోలీ పండుగ

By

Published : Mar 29, 2021, 6:21 AM IST

హోలీ.. ఆనందాల రంగోలి. ప్రతీ ఒక్కరూ తమ కష్టసుఖాలను మర్చిపోయి ఆనందలోగిలిలో జరుపుకునే సంబురం. చిన్నా పెద్దా తేడా లేకుండా రంగులుజల్లుకుంటారు. హిందువులు జరుపుకునే ఉత్సాహవంతమైన పండుగల్లో ఇదీ ఒకటి. హోలీ జరుపుకునే విధానంలో క్రమంగా అనేక మార్పులు వచ్చాయి. ఈ పండుగ కోసం పిల్లలు, పెద్దలూ ఎదురుచూస్తారు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి హోలీని జరుపుకోకుండా ఇంట్లో ఉండాలి అంటే కాస్త కష్టమే కదా. అందుకే కరోనా వేళ కొత్తగా ట్రైం చేద్దాం.

ఏడాది నుంచి ఇదే పరిస్థితి

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. ఈ వైరస్ పుణ్యమా అని ఏడాది నుంచి దాదాపు అన్ని పండుగలు నిరాడంబరంగా జరుపుకుంటున్నాం. ఇటీవల కొవిడ్ కేసులు పెరుగుతున్నందున ఈ పండుగనూ సాదాసీదాగా జరుపుకోవాల్సిందే. ఇప్పటికే ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మిగతా పండుగలను జరుపుకున్న మాదిరి దీనిని ఇంట్లోనే కుటుంబసభ్యులతో జరుపుకోలేం. ఏడాదికి ఒక్క రోజు వచ్చే ఈ రంగుల పండుగను పిల్లలు, పెద్దలూ ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాలనుకుంటారు.

నయా ట్రెండ్

అసలే కేసులు సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. ఈ సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన అవసరం చాలా ఉంది. మరి గుంపులు గుంపులుగా తిరుగుతూ రంగులు చల్లుకోవడం వల్ల కలిగే ఆనందం కన్నా అనర్థాలే ఎక్కువ. కాబట్టి ఈ కరోనా వేళ హోలీని సాంకేతికతో కొత్తగా ఇలా చేద్దాం. ఎలాగు పండుగ జరుపుకోకుండా ఉండలేం. అలాగని బయట తిరగలేం. కాబట్టి నయా ట్రెండ్ మనమే ఫాలో అయితే సరి.

ఫొటో ఎడిటింగ్

మీరు రంగులు పూయాలి అనుకునే వారి ఫొటోలు మీ దగ్గర ఉంటాయి. ఆ ఫొటోలని రంగురంగులతో నింపేయండి. ఎలా అంటే ఫొటోఎడిటింగ్ అన్నమాట. స్నాప్‌సీడ్, వీఎస్‌సీవో, ప్రిస్మా ఫొటో ఎడిటర్, ఆడొబే ఫొటోషాప్, లైవ్ కాలేజ్ వంటి యాప్​లు చాలా ఉన్నాయి. వాటిని డౌన్‌లోడ్ చేసి మనకు నచ్చిన వ్యక్తులకు రంగులద్దాలి. రంగురంగుల హోలీని జరుపుకోవచ్చు.

ఇదో కొత్త కానుక

ఫొటో ఎడిటింగ్‌లో నచ్చిన రంగుని వారికి పూయండి. ఆ ఫొటోలని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తే సరే. దానిని చూడగానే వారి పెదవులపై చిరు నవ్వు రావడం ఖాయం. పైగా ఈ మహమ్మారి సమయంలో సురక్షితం కూడా. ఇంకెందుకు ఆలస్యం మరి ఈసారి ఫొటో ఎడిటింగ్ హోలీతో కొత్తగా ప్రయత్నించండి.

ఇదీ చదవండి:హోలీ ఆడేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ABOUT THE AUTHOR

...view details