తెలంగాణ

telangana

ETV Bharat / state

Holi 2023: లీ.. హోలీ.. రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటిన సంబురాలు - తెలంగాణలో హోలీ పండగ

Holi 2023: హోలీ పండగ వచ్చిందంటే ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహంలో మునిగిపోతారు. చిన్నాపెద్దా తేడా తెలియకుండా రంగులతో ఆడుకుంటారు. రంగుల మయంతో ప్రతి ఊరూ-వాడా కళకళలాడిపోతుంది. రాష్ట్రవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. రంగుల ప్రపంచంలో ప్రజలు తేలియాడారు. వయస్సుతో సంబంధం లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఉత్సాహంగా గడిపారు.

Holi celebrations across the state
రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాలు

By

Published : Mar 7, 2023, 1:07 PM IST

Updated : Mar 7, 2023, 2:22 PM IST

Holi 2023: రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. సోమవారం రాత్రి కామదహనంతో ప్రారంభమైన వేడుకలు.. ఊరూరా ఉత్సాహంగా సాగాయి. చిన్నాపెద్దా కలిసి ఆడిపాడుతూ.. రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. హైదరాబాద్‌లోని పలు వ్యాపార సంస్థలు హోలీ వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. బేగంబజార్‌లో రాజస్థాన్‌ సమాజ్‌కు చెందిన కుటుంబాలు రంగు రంగుల రంగేలీని ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. స్థానికంగా ఉండే రాజస్థానీలు సంప్రదాయ పాటలు పాడుతూ.. హోలీ ఆడారు. మహిళలు ప్రత్యేక నృత్యాలతో ఆకట్టుకున్నారు. బేగంబజార్ ఫీల్ ఖానా, భరతన్ బజార్‌లో 'సిక్వాన్ బ్రాహ్మణ సమాజ్' ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, విభిన్న రకాల వేషధారణలతో ఇంటింటికీ తిరుగుతూ.. సహజ సిద్ధమైన రంగులు పూసుకుంటూ... హోలీ జరుపుకున్నారు.

ఇందిరాపార్క్ వాకర్స్ అసోసియేషన్​ ఆధ్వర్యంలో: గోషామహల్‌లో జరిగిన వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్‌ పాల్గొన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్కులో వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్, నగర డిప్యూటీ మేయర్‌ శ్రీలతతో పాటు కార్పొరేటర్లు, బీఆర్ఎస్​ నేతలు పాల్గొన్నారు. హిందూ సంప్రదాయాలు, ధార్మిక సిద్ధాంతాలకు ప్రతీకగా నిలిచే పండుగలను విశ్వవ్యాప్తం చేయాలని తలసాని కోరారు.

మెదక్​లో సహజమైన రంగులతో: మెదక్ జిల్లా రామాయంపేటలో సంప్రదాయ బద్ధంగా యువకులు మోదుగ పూలతో తయారు చేసిన సహజమైన రంగులతో హోలీ పండుగ జరుపుకున్నారు. కరీంనగర్ ఎస్​ఆర్​ఆర్​ కళాశాల వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో చిన్నారులు, వృద్ధులు స్టెప్పులతో అదరగొట్టారు. ఖమ్మం, వరంగల్‌లో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. చిన్నాపెద్దా రంగులు పూసుకుంటూ రంగుల్లో తడిసి ముద్దయ్యారు. ఖమ్మం పోలీసు పరేడ్‌ మైదానంలో పోలీస్‌ కమిషనర్‌ విష్ణు వారియర్‌ ఆధ్వర్యంలో వసంతోత్సవం నిర్వహించారు. తీన్మార్‌ డప్పు శబ్ధాలకు నృత్యాలు చేశారు. సీపీని భుజాలపై ఎత్తుకుని ఊరేగించారు. సీఐలు, డీఏస్పీలు రంగులు పూసుకుంటూ సందడి చేశారు.

ఖమ్మంలో తీన్మార్​ శబ్దాలతో: ఖమ్మంలో హోలీ సంబురాలు అంబరాన్ని అంటాయి. చిన్న,పెద్ద అందరూ రంగులు పూసుకుంటూ ఉత్సాహంగా వేడుకలు నిర్వహించుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు వేసుకుంటూ హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. రంగుల్లో తడిసి ముద్దయ్యారు. ఖమ్మం పోలీస్​ పరేడ్‌ మైదానంలో హోలీ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. తీన్మార్‌ డప్పు శబ్ధాలకు నృత్యాలు చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాలు

ఇవీ చదవండి:

Last Updated : Mar 7, 2023, 2:22 PM IST

ABOUT THE AUTHOR

...view details