తెలంగాణ

telangana

ETV Bharat / state

రంగుల కేళి... హోలీ సిద్ధమవుతున్నారా.. అయితే ఇది కూడా తెలుసుకోండి

Holi 2023: హోలీ రంగుల కేళి మాత్రమే కాక ఆరోగ్యాన్ని పెంచే పండుగ కూడా. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ జరుపుకొనే హోలీ విశిష్టత.. అందులో దాగి ఉన్న విషయాలను తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Holi Festival 2023
Holi Festival 2023

By

Published : Mar 6, 2023, 7:16 PM IST

Holi 2023: అన్ని వయస్సుల వారూ ఉత్సాహంగా జరుపుకునే పండుగ హోలీ. రంగుల పండుగగా హోలీ అంటే ఎప్పటికీ ఆనందకరమే. ఆనందం, సంతోషాలతో వివిధ రంగుల పొడులు, రంగులను చిమ్మే గొట్టాలతో చిన్నా పెద్ద తోడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు.ఈ రోజున తయారుచేసే శీతలపానీయాలు, స్వీట్స్​ పండుగ శోభను మరింత రెట్టింపు చేస్తాయి.

హోలీ కథలు:ఈ పండుగ ఆవిర్భావం గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. హోలిక అనే రాక్షసిని చంపటం అనే కథ, రాధా కృష్ణుల కథ బహుళ ప్రాచుర్యం పొందాయి. హిరణ్యకశిపుడు సోదరి హోలికను అగ్ని సైతం దహించలేదు. దీంతో హిరణ్యకశిపుడు హరి స్మరణ వీడని తన కుమారుడు ప్రహ్లాదుడిని, ఆమె ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్నిప్రవేశం చేయమని చెబుతాడు. కానీ హరి భక్తుడైన ప్రహ్లాదుడి స్పర్శవల్ల హోలిక శక్తి పూర్తిగా క్షీణించి, ఆమె అగ్నికి ఆహుతి అవుతుంది. ప్రహ్లాదుడు అందులో నుంచి క్షేమంగా బయటకు వస్తాడు. అలా, హోలిక దగ్ధం అయినా ఫాల్గుణ పౌర్ణమినే, ప్రహ్లాద పౌర్ణమి అని కూడా అంటారు.

రాధాకృష్ణుల రసరమ్య భావనా వాహినికి సంకేతంగా హోలీ పండుగను ఉత్తర భారతాన ఘనంగా జరుపుకుంటారు. బృందావనంలో రాసక్రీడల్లో భాగంగా శ్రీకృష్ణుడు, గోపికలపై వసంతాన్ని చిలకరిస్తాడని.. ఈ క్రమంలోనే గోపికలు ప్రేమతో కృష్ణుడిపై పన్నీరు, పుష్పాల్ని విరజిమ్మారనే కథ ప్రాచుర్యంలో ఉంది. ఆరోగ్యకరమైన మనస్సుకు వివిధ రంగులు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఎరుపు రంగు గుండె వేగాన్ని పెంచి శ్వాస క్రియను ఆరోగ్యవంతం చేస్తుంది. నీలం రంగు మన ఇంద్రియాలకు ప్రశాంతతను కల్పించి మనస్సుకు సంతోషానిస్తాయి.

శరీరాన్ని చల్లబరిచే పానీయాలు: వసంత రుతువు ప్రారంభంలో హోలీ పండుగ వస్తుంది. ఈ కాలంలో ఎన్నో రకాల బ్యాక్టీరియాలు, కాలుష్య కారకాలు మన చుట్టూ చేరుకుంటాయి. హోలీ ముందు రోజు హోలికా దహనంలో మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే క్రిములు అంతమొందుతాయి. ఈ మంటల చుట్టూ ప్రార్థిస్తూ తిరగటం మన ఆరోగ్యానికి మంచిది.ఈ సందర్భంగా చేసే తాండాయ్, కంజి మొదలైన పానీయాలు శరీరాన్ని చల్లబరుస్తాయి. తాండాయ్​కి పాల రుచి, బాదం, పుచ్చగింజలు, జీలకర్ర, గులాబి రేకులు ప్రత్యేకమైన రుచిని చేకూరుస్తాయి. కంజి సంప్రదాయక పులియబెట్టిన ద్రావణం. గుజియా అనే పాల పదార్థంలో డ్రై ఫ్రూట్స్, కొబ్బరి ఇంకా ఎన్నో ఉంటాయి.

సహజమైన రంగులు: హోలీ రంగులను మందార పువ్వులు, గోరింటాకు, కేసరాలు, చందనం మొదలైన సహజమైన మొక్కల నుంచి తయారుచేస్తారు. ఇవి మన చర్మానికే కాక కళ్లకు, జుట్టుకు కూడా మంచివి. చర్మంపై మృత కణాలను తొలగించటానికి ఇవి సహాయపడతాయి. అయితే ఈ రోజుల్లో అనేక కృత్రిమ రంగులు హోలీ సందర్భంగా అమ్ముతున్నారు. ఇవి చర్మ ఆరోగ్యానికి మంచివి కావు. అందువల్ల సహజమైన రంగులనే ఎంచుకోవాలి. ఆరోగ్యానికి మంచిది.

ఇవీ చదవండి:త్వరలో హైదరాబాద్​లో లండన్ మోడల్ భారీ జెయింట్‌ వీల్స్, స్కైటవర్స్

ఫామ్​హౌస్​లో కుమారస్వామి చండికా హోమం.. 300 మంది పూజారులను పంపిన కేసీఆర్!

ABOUT THE AUTHOR

...view details