తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న హోలీ వేడుకలు - హోలీ వార్తలు

రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో హోలీ నిరాడంబరంగా జరుపుకుంటున్నారు. కరోనా భయంతో కొద్ది మంది మాత్రమే వేడుకలు చేసుకుంటున్నారు.

holi
హోలీ

By

Published : Mar 28, 2021, 12:50 PM IST

రాష్ట్రవ్యాప్తంగా హోలీ వేడుకలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మహబూబాబాద్‌, వరంగల్‌ జిల్లాలో ప్రజలు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. చిన్నా, పెద్దా హోలీ వేడుకల్లో పాల్గొంటున్నారు.

కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో చాలా మంది హోలీకి దూరంగా ఉండగా... కొద్దిమంది మాత్రం వేడుకలు చేసుకుంటున్నారు. ప్రజలెవరూ గూమిగూడొద్దని... కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్​, సీఎం

ABOUT THE AUTHOR

...view details