నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకం అమలు పురోగతిని వాటర్‌బోర్డు ఎండీ దానకిశోర్ పరిశీలించారు. హైదరాబాద్, ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. పథకం అమలు ప్రక్రియను వేగవంతం చేయాలని.. ఆదేశాలు జారీ చేశారు.
'ఉచిత తాగునీరును త్వరగా అందిస్తాం' - వాటర్‌బోర్డు
నెలకు 20వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకం అమలును వేగవంతం చేయాలని అధికారులను జలమండలి ఎండీ దానకిశోర్ ఆదేశించారు. హైదరాబాద్, ఖైరతాబాద్‌లోని కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మురికివాడల్లోని వినియోగదారుల ఆధార్ అనుసంధాన ప్రక్రియను తర్వగా పూర్తి చేస్తామని తెలిపారు.
డొమెస్టిక్ వినియోగదారుల ఆధార్ అనుసంధాన ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి.. సెక్షన్‌కు ఒక ఆధార్ బయోమెట్రిక్ పరికరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు దానకిశోర్. క్యాన్ నంబర్లతో ఆధార్‌ను అనుసంధానం చేసుకోవడానికి మీ-సేవ కేంద్రాల్లో సౌలభ్యం కల్పించామన్నారు. మీటర్లు పని చేయని వారు.. తమ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేసుకున్న తేదీ నుంచి పథకానికి అర్హులవుతారని తెలిపారు. కొత్త మీటర్లను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని మేనేజర్లను ఆదేశించారు.