HMRL Started Preparatory Old City Metro Project Works :హైదరాబాద్ పాతబస్తీలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు.. మెట్రో రైలు నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. 5.5 కిలోమీటర్ల వరకు ఈ నిర్మాణ పనులు చేపట్టనున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు ఎంజీబీఎస్ నుంచి దారుల్‌షిఫా జంక్షన్, పురానీ హవేలీ, ఇత్తెబార్ చౌక్, అలీజా కోట్ల, మీర్ మోమిన్ దైరా, హరిబౌలి, శాలిబండ, షంషీర్‌గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్‌నుమా వరకు చేపట్టనున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి వివరించారు.
Old City Metro as 5 Stations :ఈ మెట్రో రైలుమార్గంలో.. మొత్తం 5 స్టేషన్లు ఉంటాయని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషీర్‌గంజ్, ఫలక్‌నుమా ప్రాంతాల్లో స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్‌లకు 500 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ.. వాటికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా.. రెండు స్టేషన్‌లకు వాటిపేరు పెట్టడం జరిగిందని వివరించారు. మరోవైపు ఈ మార్గంలో 21 మసీదులు, 12 దేవాలయాలు, 12 అషూర్ఖానాలు, 33 దర్గాలు, 7 స్మశానవాటికలు, 6 చిల్లాలు ఉన్నాయని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.
Old City Metro Hyderabad :మొత్తం 103 మతపరమైన, ఇతర సున్నితమైన నిర్మాణాలు ఉన్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. నాలుగు మతపరమైన నిర్మాణాలను కాపాడేందుకు.. మెట్రో అలైన్‌మెంట్‌కు సంబంధించిన ఇంజినీరింగ్ చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మతపరమైన, సున్నితమైన నిర్మాణాలను కాపాడేందుకు.. రోడ్డు విస్తరణ 80 అడుగులకు పరిమితం చేయబడుతుందని చెప్పారు. కానీ నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో మొదటి ఫేజ్ ప్రాజెక్ట్ నుంచి పాఠాలు నేర్చుకున్నామని ఎన్వీఎస్ రెడ్డి వివరించారు.