తెలంగాణ

telangana

ETV Bharat / state

హుస్సేన్​సాగర్​ ప్రక్షాళన పనులు వేగవంతం - గుర్రపు డెక్క తొలగింపు

హెచ్ఎండీఏ అధికారులు హుస్సేన్​సాగర్​ ప్రక్షాళన పనులు ముమ్మరం చేశారు. గుర్రపు డెక్క తొలగింపునకు రెండు యంత్రాలను ముంబయి నుంచి కొనుగోలు చేసి పనులు వేగవంతం చేశారు.

hmda news, cleaning process of Hussain Sagar, hyderabad news
hmda news, cleaning process of Hussain Sagar, hyderabad news

By

Published : May 15, 2021, 5:00 PM IST

హుస్సేన్ సాగర్​లో గుర్రపు డెక్క పేరుకుపోయింది. వేసవిలో దుర్వాసనతో పాటు దోమల సమస్యా తీవ్రంగా పెరిగిపోయింది. దీనిపై దృష్టి పెట్టిన హెచ్ఎండీఏ అధికారులు హుస్సేన్​సాగర్​ ప్రక్షాళన పనులు వేగవంతం చేశారు.

పేరుకుపోయిన గుర్రపు డెక్కను యంత్రాల సాయంతో తొలగిస్తున్నారు. రెండు ప్రోటిన్ ట్రాష్ క‌లెక్టర్ మిషన్లను ముంబయి నుంచి కొనుగోలు చేసిన హెచ్​ఎండీఏ అధికారులు.. పనులను ముమ్మరంగా చేస్తున్నారు.

ఇదీ చూడండి:'గాంధీ ఆసుపత్రి వద్ద నిత్యం వెయ్యి మందికి ఉచిత భోజనం'

ABOUT THE AUTHOR

...view details