తెలంగాణ

telangana

ETV Bharat / state

HMDA officials negligence: హెచ్ఎండీఏ అధికారుల ఆరంభశూరత్వం.. ఫుట్ పాత్ మీద పేరుకుపోయిన చెత్త - hyderabad district news

భాగ్యనగరంలో విహారమంటే మొదట గుర్తొచ్చేది ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతాలే. వీటికి అదనపు హంగులద్ది మరింత ఆహ్లాదం అందించాలనుకుని హెచ్ఎండీఏ అధికారులు పనులు ప్రారంభించింది. కానీ పనుల్లో ఆరంభశూరత్వమే కనిపిస్తోంది. దీంతో ఎక్కడికక్కడ చెత్త మేటలు దర్శనమిస్తున్నాయి. పీపుల్స్ ప్లాజా వద్ద రక్షణ కంచె లేక సందర్శకులకు ప్రమాదకరంగా పరిణమిస్తోంది.

hmda
hmda

By

Published : Nov 8, 2021, 2:22 AM IST

వినాయక నిమజ్జనాల కోసం క్రేన్లు నిలపడంతో దెబ్బతిన్న గచ్చు..

హైదరాబాద్‌లో సండే-ఫన్‌డేపైన ఎక్కువ దృష్టి పెడుతున్న అధికారులు.. ఇతర అభివృద్ధి పనుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. దీనికి సాక్ష్యంగా కనిపిస్తోంది.. ఇటీవలే పేరు మార్చుకుని హంగులద్దుకున్న పీవీఎన్‌ఆర్ మార్గ్. ఇక్కడి పీపుల్స్ ప్లాజాకు నిత్యం 2వేల మంది సందర్శకులు వస్తుంటారు. అయితే ఇక్కడ గత నెల వినాయక నిమజ్జనాల కోసం రెయిలింగ్ తొలగించారు. ఇక్కడ క్రేన్లు నిలపడంతో ఇటీవల మరమ్మతులు చేసిన రాతి గచ్చు దెబ్బతింది. దీనికి రూ.10 లక్షలు ఖర్చు చేసి మళ్లీ మరమ్మతులు చేశారు. అయితే ఆ పనులు సగం సగం చేసి వదిలేయడంతో ఈ దారి ప్రమాదకరంగా మారింది. ఈ ప్రాంతంలో రక్షణ కంచెకు రూ. 30 లక్షలు ఖర్చవుతుందని అంచనా. అయితే ఇన్నిరోజులు అవుతున్నా అధికారులు ఇంకా ప్రతిపాదనలు సిద్ధం చేయకపోవడం గమనార్హం.

ఫుట్ పాత్ మీదే చెత్త కుప్పలను వదిలేసిన హెచ్ఎండీఏ సిబ్బంది..

ఈ దారి ప్రమాదకరంగా మారడంతో హెచ్చరిక సూచికలు పెట్టలేదని పర్యాటకులు మండిపడుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితేగానీ ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు స్వచ్ఛ పాఠాలు వల్లించే అధికారులు ఈ మార్గంలో ఎక్కడికక్కడ చెత్త కుప్పలు వదిలేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెట్లు కోసిన సిబ్బంది వాటిని అక్కడి ఫుట్ పాత్ మీదే వేసేయడంతో తరలించే వాళ్లు లేక అవి రోజుల తరబడి అలాగే ఉండిపోతున్నాయి. దీంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కోరుతున్నారు.

ఇదీ చదవండి:Farmers Problems: అన్నదాతల అరిగోసలు.. కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు

ABOUT THE AUTHOR

...view details