అనధికార లేఅవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేసి ఎల్‌ఆర్‌ఎస్ కింద నోటీసు పొందిన దరఖాస్తుదారులకు హెచ్‌ఎండీఏ మరో అవకాశం కల్పించింది. హెచ్‌ఎండీఏ నుంచి అప్రూవల్, ఫీ నోటీసు పొంది... ఇప్పటి వరకు చెల్లింపులు జరపని వారు డేట్ ఆఫ్ ఇంటిమేషన్ నుంచి 10శాతం సాధారణ వడ్డీతో చెల్లింపులకు అవకాశం కల్పించింది. ఈ ఏడాది జనవరి 31వ తేదీనాటికి హైదరాబాద్ మెట్రో పాలిటన్ అథారిటీకి దరఖాస్తు చేసుకుని ఫీ నోటీసు పొందిన వారికి మాత్రమే ఈ అవకాశం ఇచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఎల్‌ఆర్‌ఎస్ నోటీసు పొందినవారికి హెచ్‌ఎండీఏ మరో అవకాశం - హెచ్‌ఎండీఏ
హెచ్‌ఎండీఏ పరిధిలో అక్రమ లేఅవుట్ల కింద ఎల్‌ఆర్‌ఎస్ నోటీసు పొందిన వారికి మరో అవకాశాన్ని కల్పించింది హెచ్‌ఎండీఏ. డేట్ ఆఫ్ ఇంటిమేషన్ నుంచి 10 శాతం సాధారణ వడ్డితో చెల్లింపులకు అవకాశమిచ్చింది.
ఎల్‌ఆర్‌ఎస్ నోటీసు పొందినవారికి మరో అవకాశం