తెలంగాణ

telangana

ETV Bharat / state

Sunday funday: ఆహ్లాదకరం.. హుస్సేన్​ 'సాగర' తీరం.! - ఆహ్లాదకరంగా ట్యాంక్​ బండ్​

హద్దుల్లేకుండా విస్తరిస్తున్న విశ్వ నగరంతో పాటే కాంక్రీట్ కీకారణ్యమూ పరుచుకుంటోంది. ఈ రద్దీ రోడ్లు, రణగొణ ధ్వనులు, ఆఫీసు ఒత్తిళ్ల నడుమ అలసిన మనసులు.. గోవాకో, విశాఖ తీరానికో వెళ్తుంటాయి. అంత దూరమక్కర్లేదు.. ఇక్కడే మన హుస్సేన్ సాగర్​ సైతం రూపు మార్చుకుని ఆహ్వానిస్తోంది. హెచ్​ఎండీఏ చేపట్టిన సుందరీకరణ పనులతో ట్యాంక్​బండ్(Tank Bund Sunday funday)​ ఆహ్లాదాన్ని పంచుతోంది.

tank bund
ట్యాంక్​ బండ్​

By

Published : Nov 22, 2021, 7:56 PM IST

సుందరీకరణ పనులతో ట్యాంక్ బండ్​

ఆకట్టుకునే(tank bund hyderabad) విద్యుద్దీపాలతో విదేశీ కళను, వర్టికల్ గార్డెనింగ్​తో పచ్చదనాన్ని అద్దుకున్న హైదరాబాద్​ ట్యాంక్​బండ్.. ఇప్పుడు సందర్శకులను ఆకర్షించేందుకు ముస్తాబవుతోంది. సందర్శకులు, ఉదయం, సాయంత్రం నడకకు వచ్చేవారు కాసేపు అలా సేద తీరేందుకు ప్రత్యేక వేదికలను హెచ్​ఎండీఏ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పలు షెడ్ల నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వచ్చాయి.

రచ్చబండల్లా

కొత్తగా ఇక్కడున్న చెట్ల చుట్టూ పల్లెల్లో మాదిరి రచ్చబండలాంటి నిర్మాణాలను హెచ్​ఎండీఏ(tank bund hyderabad news) చేపడుతోంది. గ్రేటర్ వాసుల కోసం చేపడుతున్న సన్ డే- ఫన్ డే(sunday funday) కార్యక్రమంలో భాగంగా ఎప్పటికప్పుడు అధికారులు కొత్త ప్రణాళికలను రూపొందిస్తున్నారు.

Sunday funday: సందర్శకులకు మధురానుభూతి పంచుతున్న "సన్​ డే ఫన్​ డే"

సాగర తీరంలో సరదాగా

గతంలో సందర్శకులు వచ్చి వెళ్లిపోయే విధంగా మాత్రమే ట్యాంక్ బండ్ ఉండగా ఇప్పుడు ఇక్కడే కుటుంబాలతో కలిసొచ్చి భోజనాలు చేస్తూ గంటల తరబడి సాగర తీరంలో గడిపేస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి చేసిన పార్కులనూ ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ, పారిశుద్ధ్యానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. శని, ఆది వారాల్లో ఈ దారులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఈ మార్గాలను శుభ్రం చేసేందుకు ఇటీవలే ప్రత్యేకంగా ఒక్కోటి రూ.80 వేల విలువైన మాపింగ్ స్కూటర్లను హెచ్​ఎండీఏ తీసుకొచ్చింది.

నగరవాసుల ఆనందం

ఇన్నాళ్లు చూసిన ట్యాంక్‌బండ్‌ కంటే ఇప్పుడు చూస్తున్న ట్యాంక్‌బండ్‌ (Sunday funday at tank bund) చాలా బాగుందని నగరవాసులు అంటున్నారు. ఆదివారం ఇక్కడికి వస్తే సొంత ఊళ్లలో ఉన్నామనే భావన కలుగుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పల్లె జాతరకు వెళ్తుంటే ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఇక్కడికొస్తే అలాంటి మధురానుభూతి కలుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:Niranjan reddy on BJP and Congress: 'రాష్ట్ర రైతులను పట్టించుకోలేదని దుష్ప్రచారం'

ABOUT THE AUTHOR

...view details