రంగారెడ్డి జిల్లా నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డు సర్కిల్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను మునిసిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ పరిశీలించారు. ఓఆర్ఆర్ 153 కిలోమీటర్ వద్ద దాదాపు 4 ఎకరాల విస్తీర్ణంలో హరిత సుందరీకరణ పనులు చేపట్టారు. పనులు వేగవంతం చేయాలని హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ అధికారులను ఆయన ఆదేశించారు.