తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​ చెరువుల్లో గుర్రపు డెక్కపై మహా సమరం

నగరంలోని చెరువుల సుందరీకరణకు హెచ్​ఎండీఏ నడుం బిగించింది. చెరువుల్లోని గుర్రపు డెక్క తొలగింపుపై దృష్టిపెట్టారు. దీన్ని తీసేయటం వల్ల దోమల సమస్య తొలగిపోతుందని చెబుతున్నారు. హుస్సేన్​సాగర్​ ప్రక్షాళన పనులు కూడా వేగవంతం చేశారు.

By

Published : Mar 25, 2019, 8:14 PM IST

Updated : Mar 26, 2019, 2:36 PM IST

చంద‌న్ చెరువులో గుర్రపు డెక్కలను తొలగిస్తున్న యంత్రం

చంద‌న్ చెరువులో గుర్రపు డెక్కలను తొలగిస్తున్న యంత్రం
హైదరాబాద్ నగర శివారులోని చెరువులకు పూర్వవైభవం తీసుకొస్తామని పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ అన్నారు. మొదటి దశ కింద 20 చెరువులను సుంద‌రీక‌రించాల‌ని నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లెలగూడ‌లోని చంద‌న్ చెరువులో గుర్రపు డెక్క తొల‌గింపు ప‌నుల‌ను ప్రారంభించారు.

గుర్రపు డెక్క తొలగింపునకు మూడు కోట్ల రూపాయలతో రెండు ప్రోటిన్ ట్రాష్ క‌లెక్టర్ మిషన్లను ముంబయి నుంచి హెచ్​ఎండీఏ కొనుగోలు చేసింది. ఒక ట్రాష్ క‌లెక్టర్​ను రాంపూర్ చెరువులో... మరొకటి చంద‌న్ చెరువులో ఏర్పాటు చేశారు. 51 ఎక‌రాల్లో విస్తరించి ఉన్న చంద‌న్ చెరువు ఆక్రమ‌ణ‌ల‌పై అరవింద్ కుమార్ మండిపడ్డారు. కబ్జాదారులపై వెంట‌నే చ‌ర్యలు తీసుకోవాల‌ని అధికారులను ఆదేశించారు.

Last Updated : Mar 26, 2019, 2:36 PM IST

ABOUT THE AUTHOR

...view details