భారీ వర్షాలకు భాగ్యనగరం అతలాకుతలమయింది. చాలా ప్రాంతాల్లో ఇళ్లు, వాహనాలు నీటమునిగాయి. మరికొన్ని ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న భవనాలు, ఇళ్లు నేలకూలాయి. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వాన ప్రభావం చారిత్రాత్మక గోల్కొండ కోటపైనా పడింది.
వరుణాగ్రహం... చారిత్రక గోల్కొండ కోట గోడ నేలమట్టం - Golkonda fort in Hyderabad
భాగ్యనగరాన్ని అతలాకుతలం చేసిన వాన ప్రభావం ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన చారిత్రక కట్టడం గోల్కొండ కోటపైనా పడింది. ఎడతెరిపి లేకుండా మూడ్రోజులు కురిసిన వర్షానికి కోటలోని ఓ గోడ కూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది.
భారీ వర్షానికి గోల్కొండ కోట గోడ నేలమట్టం..
నగరంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోల్కొండ కోటలోని ఓ గోడ నేలమట్టమైంది. గోడ కూలిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. నగరంలో శిథిలావస్థకు చేరిన భవనాలు, ఇళ్ల సమీపంలో ఉన్న ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.