తెలంగాణ

telangana

ETV Bharat / state

Hyderabad name News: 'హైదరాబాద్‌ తొలిపేరు భాగ్యనగర్‌ కాదు' - తెలంగాణ వార్తలు

Hyderabad name News : రాజకీయ పార్టీలు తమ స్వలాభం కోసం హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చకూడదని ప్రముఖ చరిత్రకారుడు కెప్టెన్ ఎల్. పాండురంగారెడ్డి కోరారు. హైదరాబాద్ పేరు మార్చాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో డెక్కన్‌ హెరిటేజ్‌ ట్రస్టు నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

Hyderabad name News, bhagyanagar news
హైదరాబాద్‌ తొలిపేరు భాగ్యనగర్‌ కాదు: చరిత్రకారులు

By

Published : Jan 5, 2022, 8:27 AM IST

Hyderabad name News : హైదరాబాద్‌ నగరానికి తొలి పేరు భాగ్యనగర్‌గా ప్రచారం చేస్తున్నారని, అది పొరపాటని పలువురు చరిత్ర కారులు పేర్కొన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో డెక్కన్‌ హెరిటేజ్‌ ట్రస్టు నిర్వహించిన సమావేశంలో చరిత్రకారుడు కెప్టెన్‌ లింగాల పాండురంగారెడ్డి, సీనియర్‌ పాత్రికేయులు కింగ్‌ షుక్‌ నాగ్‌, రీసెర్చ్‌ స్కాలర్‌ సయ్యద్‌ ఇనాముర్‌ రహ్మాన్‌ ఘూయుర్‌ మాట్లాడారు. హైదరాబాద్ చారిత్రక విశేషాలను వెల్లడించారు.

బాగ్‌నగర్‌..

1590లో గోల్కొండలో ప్లేగు విజృంభించడంతో రాజు దర్బార్‌ ఖాళీ చేసి తన వారితో మూసీ నది దక్షిణాన విడిది ఏర్పాటు చేసుకున్నారని, అక్కడ వేడి అధికంగా ఉండటంతో పాటు, వారున్న ప్రాంతం ఇతరులకు కనిపించొద్దని అనేక తటాకాలు, తోటలు ఏర్పాటు చేయించారని వివరించారు. ఫ్రాన్స్‌కుచెందిన టావెర్నియర్‌ గోల్కొండను సందర్శించినపుడు అనేక తోటలు ఉండటాన్ని చూసి బాగ్‌నగర్‌గా(తోటల నగరం) పుస్తకంలో రాశాడని వివరించారు. ఖుతుబ్‌షాహీలు తయారుచేసిన నాణేలపైనా భాగ్యనగర్‌ పేరు కనిపించదని చెప్పారు.

చారిత్రక ఆధారాలు లేవు..

రాజకీయ పార్టీలు తమ స్వలాభం కోసం హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చకూడదని ప్రముఖ చరిత్రకారుడు కెప్టెన్ ఎల్. పాండురంగారెడ్డి కోరారు. హైదరాబాద్ పేరు మార్చాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్​కు భాగ్యనగరం పేరుందన్న ప్రచారం కట్టుకథేనని ఆయన స్పష్టం చేశారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయానికి కూడా చారిత్రక ఆధారాలు లేవని, రాజకీయ ప్రయోజనాల కోసమే హైదరాబాద్ పేరు మార్పు అంశాన్ని ప్రస్తావిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఇదీ చదవండి:Sowing seeds with Drone in Farming : కూలీల అవసరం లేకుండా 'డ్రోన్‌' సాగు

ABOUT THE AUTHOR

...view details