నిరుద్యోగులకు హైఫ్రోఫైల్ గాళం 100 మంది బాధితులు... ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.35 లక్షల విలువైన నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు, ఓ కారు, రూ.10 లక్షల నగదు, ప్రింటర్స్, చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌బీఐ, ఆర్‌ఆర్‌బీ, ఐటీ విభాగాల పేర్లతో నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు సృష్టించి సుమారు 100 మందిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.
అందరిపై కఠిన చర్యలు...ప్రధాన నిందితున్ని 18 న అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో నలుగుర్ని అరెస్టు చేశారు. మరో ఏడుగురు పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి బాధితులు ఉన్నారని తెలిపారు.పలు చోట్ల సంస్థ ప్రతినిధులుగా ఉండి కొందరు వ్యక్తులు ఈ తతంగాన్ని నడిపిస్తున్నారన్నారు. ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు సీపీ స్పష్టం చేశారు.