రాజధానిలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హిమాయత్‌సాగర్‌కు వరద రావడంతో జలాశయం నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరింది. పదేళ్ల తరువాత జలాశయం వరదనీటితో కళకళలాడుతోంది. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహం దృష్టిలో ఉంచుకొని జలమండలి అధికారులు 14 గేట్లను ఎత్తి 17150 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. జలాశయానికి ప్రస్తుతం17200 క్యూసెక్యుల ఇన్‌ఫ్లో ఉంది.
హిమాయత్‌సాగర్ జలాశయం పద్నాలుగు గేట్లు ఎత్తివేత - హిమాయత్‌సాగర్ జలాశయం పద్నాలుగు గేట్లు ఎత్తివేత
వర్ష బీభత్సానికి హిమాయత్‌సాగర్‌లోకి భారీగా వరదనీరు చేరడంతో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరింది. ప్రాజెక్ట్‌లోకి 17200 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండడంతో 14 గేట్లు ఎత్తి 17150 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు. దీంతో లోతట్టు ప్రాంత వాసులను అప్రమత్తం చేశారు.
హిమాయత్‌సాగర్ జలాశయం పద్నాలుగు గేట్లు ఎత్తివేత
హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 2.97 టీఎంసీలతో నిండుకుండను తలపిస్తోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1763.5 అడుగులకు చేరింది. దిగువకు నీటి విడుదలతో... లోతట్టు ప్రాంత వాసులను అధికారులు అప్రమత్తం చేశారు.
ఇదీ చూడండి:హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు
Last Updated : Oct 14, 2020, 8:18 AM IST