హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో హిమాయత్ సాగర్ జలాశయం నిండుకుండలా మారంది. హిమాయత్ సాగర్‌లోకి 1,200 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుంది. హిమాయత్ సాగర్ గరిష్ఠ నీటిమట్టం 1763.50 అడుగులు కాగా... ప్రస్తుతం పూర్తి స్థాయి నీటిమట్టానికి ప్రవాహం చేరింది.
నీటిమట్టం పూర్తిగా నిండడంతో జలమండలి అధికారులు... జలాశయం 2 గేట్లు ఎత్తారు. ఒక్కో గేటు అడుగు మేర ఎత్తి మూసీలోకి నీటిని వదలుతున్నారు. ఈ నేపథ్యంలో మూసీ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పోలీస్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఉస్మాన్‌సాగర్ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1788.15 అడుగులు నీరుంది. ప్రస్తుతం ఉస్మాన్‌సాగర్‌లోకి 2,600 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.