తెలంగాణ

telangana

ETV Bharat / state

'రానున్న 30 నుంచి 40 ఏళ్ల పాటు భాజపా శకం.. విశ్వగురుగా భారత్​'

రానున్న 30 నుంచి 40 ఏళ్ల పాటు దేశంలో భాజపా శకం కొనసాగి.. భారత్​ విశ్వగురుగా అవతరిస్తుందని హోంమంత్రి అమిత్​ షా విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యవర్గ సమావేశాల్లో రాజకీయ తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడిన ఆయన.. వంశపారంపర్య, కుల, బుజ్జగింపు రాజకీయాలు దేశానికి శాపంగా మారాయని మండిపడ్డారు. దేశాన్ని దశాబ్దాలుగా పట్టిపీడిస్తోన్న సమస్యలకు అవే మూలమని అమిత్​ షా ఆరోపించారు.

'రానున్న 30 నుంచి 40 ఏళ్ల పాటు భాజపా శకం.. విశ్వగురుగా భారత్​'
'రానున్న 30 నుంచి 40 ఏళ్ల పాటు భాజపా శకం.. విశ్వగురుగా భారత్​'

By

Published : Jul 3, 2022, 8:14 PM IST

'రానున్న 30 నుంచి 40 ఏళ్ల పాటు భాజపా శకం.. విశ్వగురుగా భారత్​'

హైదరాబాద్ వేదికగా జరుగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉత్సాహంగా సాగాయి. తొలిరోజు ఆర్థిక తీర్మానంపై చర్చ జరగగా.. రెండో రోజు రాజకీయ తీర్మానంపై ప్రధానంగా చర్చ సాగింది. కేంద్ర హోంమంత్రి అమిత్​ షా.. రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై మద్దతు పలికారు. ప్రధాని మోదీ.. చర్చలో పాల్గొని చాలా అంశాల్లో మార్పులు చేర్పులు సూచించినట్లు.. హిమంత బిశ్వశర్మ వెల్లడించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో నిలిపిన ద్రౌపది ముర్ము జీవితంపై ఓ దృశ్య మాలికను తయారు చేయాలని ప్రధాని సూచించినట్లు హిమంత వివరించారు.

ప్రతి అంశాన్నీ వ్యతిరేకిస్తున్నారు.. గుజరాత్ అల్లర్ల కేసులో వేర్వేరు ఆరోపణలు వచ్చినా.. విచారణలన్నింటినీ ఎదుర్కొని ప్రధాని మోదీ మకిలి అంటకుండా బయటపడ్డారని అమిత్​ షా చెప్పినట్లు బిశ్వశర్మ తెలిపారు. విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా.. మోదీ విచారణకు సహకరించారని గుర్తు చేశారు. దర్యాప్తు సంస్థల విచారణకు సహకరించకుండా రాహుల్​ గాంధీ నాటకాలాడుతున్నారని అమిత్​ షా చెప్పినట్లు శర్మ వెల్లడించారు. ప్రతిపక్షాలు సర్జికల్ స్ట్రైక్స్, 370 అధికరణ రద్దు.. జీఎస్టీ, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, కొవిడ్​ టీకాలు ఇలా ప్రతి అంశాన్నీ వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. కుటుంబ పార్టీ కాబట్టే కాంగ్రెస్.. తన అధ్యక్షుడిని ఎన్నుకోలేకపోతోందని అమిత్​ షా విమర్శించినట్లు శర్మ తెలిపారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో భాజపా విజయం.. వంశపారంపర్య, బుజ్జగింపు రాజకీయాలకు ముగింపు పడిందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం దేశంలో సమర్థ పాలన, అభివృద్ధి రాజకీయాల శకం నడుస్తోంది. తెలంగాణ, పశ్చిమ బంగాలోఎప్పుడు ఎన్నికలు జరిగినా కుటుంబ పాలనకు ముగింపు పలికి విజయం సాధిస్తామని అమిత్​ షా తెలిపారు. త్వరలోనే బంగాల్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశాలో భాజపా ప్రభుత్వాలు ఏర్పడుతాయని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే 30 నుంచి 40 ఏళ్ల పాటు భాజపా శకం నడుస్తుంది. ఆ కాలంలో భారత్​ విశ్వగురుగా అవతరిస్తుంది.-హిమంత బిశ్వశర్మ, అసోం ముఖ్యమంత్రి

జమ్మూకశ్మీర్​లో 370 అధికరణ రద్దు, అగ్నిపథ్ పథకం.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ భర్తీ ఏర్పాటుపైనా కార్యవర్గ సమావేశంలో చర్చించారు. దేశ రక్షణతో పాటు అంతర్గత భద్రతపైనా సమాలోచనలు జరిపారు. కుటుంబ పాలన, జాతి, కుల, మత ప్రాంతాల ప్రాతిపదికన మాత్రమే ఎన్నికలు జరిగేవని.. మోదీ ప్రభుత్వం వచ్చాక.. అభివృద్ధి, సుస్థిర పాలనపైనే జరుగుతున్నాయని తెలిపారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత భాజపా జెండా ఎగరని రాష్ట్రాల్లో విజయం సాధిస్తామని అమిత్​ షా ధీమా వ్యక్తం చేసినట్లు బిశ్వశర్మ తెలిపారు.

తగ్గిన పేదరికం..: మోదీ పాలనలో దేశంలో పేదరికం 22 శాతం నుంచి దిగివచ్చి కేవలం 10 శాతానికి పరిమితమైందని అమిత్​ షా తెలిపినట్లు బిశ్వశర్మ తెలిపారు. భారత్ ప్రపంచానికి మార్గదర్శకత్వం వహించే స్థాయికి చేరుకుందని.. ప్రధాని మోదీని విశ్వనేతగా ప్రపంచ దేశాలు చూస్తున్నాయని రాజకీయ తీర్మానంలో ప్రస్తావించారు.

ABOUT THE AUTHOR

...view details