తెలంగాణ

telangana

ETV Bharat / state

HIMANSHU: హిమాన్షుకు డయానా అవార్డు... ఎందుకంటే? - హిమాన్షుకు డయానా పురస్కారం

మంత్రి కేటీఆర్​ తనయుడు హిమాన్షును డయానా అవార్డు వరించింది. చిన్న వయసులోనే సామాజిక సేవలో చురుగ్గా పాల్గొనే వారికి ఈ అవార్డు బహుకరిస్తారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని ట్విట్టర్​ వేదికగా హిమాన్షు తెలిపారు. సమాజంలో మార్పు కోసం మానవీయ దృక్పథంతో పనిచేసే వారికి డయానా పేరుతో బ్రిటన్​ సంస్థ అవార్డులు అందజేస్తోంది.

Himanshu got Diana Award
హిమాన్షుకు డయానా అవార్డు

By

Published : Jun 28, 2021, 8:20 PM IST

Updated : Jun 28, 2021, 10:29 PM IST

సీఎం కేసీఆర్ మనువడు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ తనయుడు హిమాన్షుకు డయానా అవార్డు లభించింది. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తానని చెప్పారు. సమాజంలో మార్పు కోసం మానవీయ దృక్పథంతో పనిచేసే వారికి డయానా పేరుతో బ్రిటన్​ సంస్థ అవార్డులు అందజేస్తోంది.

గ్రామాల్లో స్వయం సమృద్ధి దిశగా చేపట్టే అంశాలతో శోమ పేరుతో హిమాన్షు ప్రాజెక్టును ప్రారంభించారు. గజ్వేల్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేపట్టిన హిమాన్షు... గంగాపూర్, యూసుఫ్‌ఖాన్‌పల్లిలో అతనికి సహకరించిన గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు. మార్గదర్శం చేసిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.

అసలు డయానా అవార్డు అంటే ఏమిటి?

యుక్త వయసులోనే సామాజిక దృక్పథంతో ఇతరుల జీవితాలను మెరుగుపర్చేందుకు కృషి చేసే యువకులకు ఈ అవార్డు అందజేస్తారు. ఈ అవార్డు 9-25 ఏళ్ల వయస్సు మధ్య గల వారికి సామాజిక సేవకు గానూ లభించే అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారం. బ్రిటన్​లోని వేల్స్ యువరాణి డయానా పేరు మీద ఈ అవార్డును ప్రవేశపెట్టారు.

హిమాన్షుకు కేటీఆర్ అభినందనలు

డయానా అవార్డు పొందిన తనయుడు హిమాన్షుకు మంత్రి కేటీఆర్​ ట్విట్టర్​ వేదికగా అభినందనలు తెలియజేశారు. తాను మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు. ఓ తండ్రిగా తనకు సంతోషంగా ఉందన్నారు కేటీఆర్

ఇదీ చూడండి:పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: కల్వకుంట్ల హిమాన్షు

Last Updated : Jun 28, 2021, 10:29 PM IST

ABOUT THE AUTHOR

...view details