తెలంగాణ

telangana

ETV Bharat / state

'గవర్నర్ పదవి... గురుతరమైన బాధ్యత' - సంవత్సరం పూర్తి చేసుకుంటున్న బండారు దత్రాత్రేయ

గవర్నర్ పదవిని గురుతరమైన బాధ్యతగా భావిస్తున్నానన్నారు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ. పదవి చేపట్టి సంవత్సరం గడుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.

'గవర్నర్ పదవి... గురుతరమైన బాధ్యత'
'గవర్నర్ పదవి... గురుతరమైన బాధ్యత'

By

Published : Sep 10, 2020, 8:10 PM IST

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా బండారు దత్తాత్రేయ పదవీ బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న... సందర్భంగా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తెలుగు ప్రజలను, తెలుగుతనాన్ని ఎక్కడికి వెళ్లిన మరచిపోలేనని పేర్కొంటూ... అందరికి ధన్యవాదాలు తెలియజేశారు. జీవితంలో మొదటిసారి రాజ్యాంగబద్ధమైన పదవిని స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు.

హిమాచల్ ప్రదేశ్ ప్రజలతో... తెలంగాణ ప్రజలతో ఉంటూ, తన సమకాలికులు, మిత్రులు, శ్రేయోభిలాషులందరితోనూ ప్రేమానురాగాలతో టెలీకమ్యూనికేషన్ ద్వారా నిలుపుకున్నానని తెలిపారు. తాను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఎత్తైన శిఖరాలు, దట్టమైన, విశాలమైన అడవులు, సుందరమైన హిమనది జలపాతాలతో కూడిన దేవభూమి హిమాచల్ ప్రదేశ్ అని పేర్కొంటూ... ఇది ఒక గురుతరమైన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.

ఇదీ చూడండి: విద్యా సంవత్సరం ఖరారు చేసిన ఇంటర్ బోర్డు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details